జూలై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని అంగన్వాడీ ల సమ్మె నోటీస్
*జూలై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని అంగన్వాడీ ల సమ్మె నోటీస్.*
అక్షర విజేత ములుగు ప్రతినిధి:
జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా జూలై 9 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారి రాజ్ కుమార్, ఇన్చార్జి డి డబ్ల్యూ ఓ తుల రవి గార్లకు సమ్మె నోటీసులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ లేబర్ కోడ్స్ వలన కార్మికుల సమిష్టి బేరసారాల హక్కు ఉండదని అన్నారు. ఉద్యోగ భద్రత , ఉపాధి అవకాశాలు ఉండవని అన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఉన్నప్పటికీ నేటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఇక లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే జీతాలు పెరిగే అవకాశం లేదని అన్నారు. స్కీం వర్కర్లకు సామాజిక భద్రత పథకాలు ప్రశ్నార్థకం అవుతాయని అన్నారు. ఐసిడిఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ స్కీములను ప్రభుత్వ శాఖలుగా గుర్తించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి కె సమ్మక్క,భవాని, సునిత , సుమంజలి తదితరులు పాల్గొన్నారు.